- Step 1
బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి.
- Step 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.
- Step 3
ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి.
- Step 4
దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి.
- Step 5
ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు).
- Step 6
ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.