- Step 1
ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నింటిని రెండు మూడు నిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి.
- Step 2
తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడిచేసి రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. కలియబెడుతూ వేయించడం వల్ల రవ్వ బ్రౌన్ కలర్ కు మారకుండా ఉంటాయి.
- Step 3
ఇప్పుడు అదే పాన్ లో చాలా కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. అందులో బెల్లం తురుము వేసి మంట తగ్గించాలి. బెల్లం కరిగాక దింపేయాలి.
- Step 4
మరో పాన్ లో మిగిలిన నీళ్లు తీసుకుని స్టౌమీద మరగించాలి. నీరు మరుగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి, రవ్వ వేసి మంట తగ్గించేయాలి.
- Step 5
రవ్వ ఉడికాక బెల్లం కరిగించిన నీరు వేసి బాగా కలపాలి.
- Step 6
మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతుంటే కాసేపటికి కేసరి దగ్గరకు వస్తుంది. అప్పుడు మిగిలిన నెయ్యీ, వేయించి పెట్టుకున్న జీడిపప్పూ, కిస్‌మిస్, బాదం పలుకులూ, యాలకులపొడీ వేసి కలపాలి.
- Step 7
రెండు నిమిషాల తరవాత దింపేయాలి. అంతే బెల్లం కేసరి బాత్ రెడీ. నవరాత్రి స్పెషల్ గా దుర్గా దేవికి నైవేద్యం, మనకు ప్రసాదం..