- Step 1
మామిడికాయను కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, చల్లారనివ్వాలి. తగినన్ని నీళ్లు పోసి పప్పు మెత్తగా ఉడికించి పక్కన ఉంచాలి.
- Step 2
పప్పును పలుకులుగా లేకుండా మెదపాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి మరీ సన్నగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 3
గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు, ఒకదాని తర్వాత ఒకటి వేసి మగ్గనివ్వాలి.
- Step 4
ఉడికిన మామిడికాయను రసం తీసి పప్పులో పోసి కలపాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న ముక్కల్లో పోసి, కారం, ఉప్పు కలిపి మరగనివ్వాలి.
- Step 6
తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర వేసి మరిగిన తర్వాత దించాలి. రుచి కోసం సాంబారుపొడి వేసుకోవచ్చు.