- Step 1
ముందు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నువ్వులు వేయించాలి. దోరగా వేగి, కమ్మటి వాసన రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు విడివిడిగా మగ్గనివ్వాలి.
- Step 3
ఆఖరులో కొంచెం చింతపండు (పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు) కడిగి వేసి, స్టవ్ కట్టేయాలి.
- Step 4
ఇది చల్లారాక ముందుగా నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి.
- Step 5
తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, చింతపండు, టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 6
మరీ మెత్తగా అయితే బాగోదు. నువ్వులు పచ్చడి దోసెల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.