- Step 1
ఒక గిన్నెలో గ్లాసుడు నీరు పోసి మరిగాక అందులో సేమ్యా వేసి ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
బాణలి స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కాగాక... ఉల్లితరుగు, జీడిపప్పు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- Step 3
తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి తరుగు వరసగా ఒకదాని తరవాత ఒకటి వేసి రెండు నిముషాలు వేయించాలి.
- Step 4
ఇప్పుడు పచ్చిరొయ్యలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలిపి, ఉడుకుతుండగా సేమ్యా వేసి బాగా కలిపి ఒక నిముషం ఉడికిన తరవాత నిమ్మరసం వేసి కలిపి దించేయాలి.
- Step 5
కొత్తిమీర, పుదీనా, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి.