- Step 1
ముందుగా చికెన్ శుభ్రం చేసి ఒక గిన్నెతీసుకొని అందులో పెరుగు, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, మరియు పసుసు వేసి బాగా కలిపి చికెన్ కు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
చిన్న పాత్ర తీసుకొని అందులో రెండు కప్పుల సేమియాకు రెండు కప్పుల నీళ్ళు పోసి కాగా కాగనివ్వాలి.
- Step 3
నీళ్ళ మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు, నూనె, వేసి తర్వాత సేమియాను కూడా వేసి బాగా కలపాలి. . సేమియా బాగ పొడిపొడిగా అయ్యేంత వరకూ మీడియం మంట మీద ఉడకనివ్వాలి. (75%ఉడికిన తర్వాత నీళ్ళు ఏమైనా ఉంటే వంచేసి పక్కన పెట్టుకోవాలి).
- Step 4
అంతలోపు మరో పాన్ తీసుకొని అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.
- Step 5
అందులో గరం మసాలాకు సిద్దం చేసుకొన్నవి వేసి వేయించాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
- Step 6
తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ బాగా వేయించుకోవాలి.
- Step 7
ఇప్పుడు కట్ చేసిపెట్టుకొన్న టమోటో ముక్కలు వేసి వేయించి మొత్తగా ఉడకనివ్వాలి.
- Step 8
తర్వాత పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
- Step 9
ఇప్పుడు ముందుగా మసాలా అంటించి పెట్టుకొన్ని చికెన్ అందులో వేసి బాగా వేయించాలి.
- Step 10
చికెన్, మసాలా మిశ్రమం బాగా కలిసి ఉడికేలా చూసుకోవాలి.
- Step 11
చికెన్ ఉడికిందని మీరు నిర్ధారించుకొన్నప్పుడు అందులో తగినంత ఉప్పు, ఉడికించి పెట్టుకొన్న సేమియా వేసి మరో రెండు నిమిషాల పాటు మసాలా సేమియాకు పట్టే విధంగా మగ్గనివ్వాలి.
- Step 12
ఇప్పుడు పాన్ కు సరిగా సరిపోయే మూత పెట్టి, మంట తగ్గించి ఆవిరి మీదే మరో పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. (లేదా ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు).
- Step 13
పది నిమిషాల తర్వాత కొత్తిమీర తరగు, జీడిపప్పుతో గార్నిష్ చేసి ఏదేని రైతాతో హాట్ హాట్ గా సర్వ్ చేయాలి అంతే చికెన్ సేమియా బిర్యాని రెడీ.