- Step 1
పైన చెప్పుకున్న వాటిలో సగం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
- Step 2
చివరిలో కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఈ సారి నూనె లేకుండా మిగిలిన ఆవాలు, మినప్పపు, శనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి వేయించాలి. చల్లారాక పొడి చేసుకోవాలి.
- Step 4
బాండీలో మిగిలిన సగం నూనె వేసి క్యాప్సికం ముక్కలు వేయించాలి.
- Step 5
ఇందులో తాలింపు గింజల పొడి, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి.
- Step 6
దీన్లో ముందు తాలింపు వేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కలుపుకుంటే క్యాప్సికం చట్నీ రెడీ.