- Step 1
ముందుగా మునగాకును శుభ్రం చేసి, కడిగి ఆరబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక మునగాకు వేసి తడి ఆరేవరకు వేయించి పక్కన పెట్టాలి.
- Step 2
అదే బాణలిలో మరికాస్త నూనె వేసి ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, అనాసపువ్వు, నువ్వులను విడివిడిగా వేయించి తీసేశాక, ఎండుమిర్చిని కూడా వేయించి చల్లార్చుకోవాలి.
- Step 3
అన్నీ చల్లారిన తరవాత మిక్సీలో ఒకటొకటిగా వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
చివరగా పసుపు, వెల్లుల్లి, ఉప్పు, మునగాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసేయాలి.
- Step 5
పది నిముషాలయ్యాక ఈ పొడిని ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి.
- Step 6
ఇది సుమారు నెలరోజులు నిలవ ఉంటుంది.
- Step 7
మునగాకు నువ్వులు మసాలా పొడి అన్నంలోకి, దోసెలపైన జల్లుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది.