- Step 1
బాణలిలో చెంచాడు నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి మూత పెట్టి ఉడికించాలి.
- Step 3
వేయించిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని, దానిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఉడికించి చల్లార్చిన బెండ, టొమాటో మిశ్రమం వేసి మరోసారి మిక్సీ వేయాలి. మరీ మెత్తగా కాకూడదు.
- Step 4
బాణలిలో నూనె కాగాక, పోపుదినుసులు వేయించాలి.
- Step 5
చిటపటలాడాక కరి వేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి ఈ పోపును పచ్చడిలో కలపాలి.