- Step 1
ఉల్లిపాయలను ఒలిచి మీడియం సైజులో క ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో చింతపండును నానపెట్టాలి.
- Step 2
బాగా నానిన తరవాత చిక్కగా పులుసు తీసి చింతపండు పిప్పి తీసేయాలి.
- Step 3
ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, బెల్లం, తరిగిన పచ్చిమిర్చి, రెండు గ్లాసుల నీరు పోసి ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి.
- Step 4
తరవాత అందులో చింతపండురసం పోయాలి. ఇది కూడా బాగా ఉడికిన తరవాత ఇందులో నీళ్లలో కలిపిన శనగపిండిని పోయాలి.
- Step 5
అన్నీ బాగా మరిగిన తరవాత అందులో వేయించి ఉంచుకున్న పోపు వేసి బాగా కలపాలి.
- Step 6
చివరగా కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి. ఇది అన్నంలోకి, ముద్దపప్పులోకి చాలా రుచిగా ఉంటుంది.