- Step 1
టొమాటో ముక్కలకు ఒక కప్పు నీరు, బిరియాని ఆకు, మిరియాలు చేర్చి మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. బిరియాని ఆకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- Step 2
ఈ గుజ్జును మెత్తగా రుబ్బి వడగట్టాలి. బాండీలో వెన్న వేడి చేసి మైదా వేసి మీడియం మంట మీద 1 నిమిషంపాటు ఉడికించాలి.
- Step 3
దీన్లో ముందుగా తయారుచేసిపెట్టుకున్న టొమాటో మిశ్రమం, టొమాటో గుజ్జు, ఒక కప్పు నీళ్లు చేర్చి కలిపి 1 నిమిషంపాటు ఉడికించాలి.
- Step 4
చక్కెర, ఉప్పు, మిరియాలపొడి, మీగడ వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
- Step 5
తాజా మీగడ, బ్రెడ్ ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.