- Step 1
బీన్స్, క్యారట్‌ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తగినంత నీరు పోసి నూడుల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, ఉడికించిన కూరముక్కలు వేసి వేయించాక, కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాలపొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి మరిగించాలి.
- Step 4
మరిగాక నూడుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి.
- Step 5
కొద్దిగా చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.