- Step 1
చింతపండును నానబెట్టి చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి.
- Step 2
బాణలిలో నూనె వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేయాలి.
- Step 3
పులుసు ఉడుకుతుండగా మరొక బాణలిలో నూనె వేయకుండా శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను వేయించాలి. ఈ పప్పులు చల్లారేలోపు అదే బాణలిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. చల్లారిన తర్వాత పప్పులను, పోపు దినుసులను విడిగా పొడి చేసుకోవాలి.
- Step 4
మరుగుతున్న పులుసులో బెల్లం వేసి, తర్వాత పోపు దినుసుల పొడి వేయాలి. ఆ తర్వాత పప్పుల పొడిని నీటిలో కలిపి (ఉండలు కట్టకుండా ఉండడానికి) పులుసులో పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించి దించాలి.