- Step 1
పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి.
- Step 2
తర్వాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి.
- Step 3
జల్లించిన మైదా, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి.
- Step 4
పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి.
- Step 5
ఒక కేకు టిన్నులో లోపల భాగమంతా వెన్న రాసి ,కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు కదిపి కలిపి ఉంచుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 45 – 50 నిమిషాలు బేక్ చేయాలి.
- Step 6
రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీకు కావాలంటే ,ఓపిక ఉంటే ఐసింగ్ చేసుకోండి లేదంటే అలాగే ముక్కలు చేసి సర్వ్ చేయండి..