- Step 1
ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్‌మిస్‌లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి .
- Step 2
మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి .
- Step 3
వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి .
- Step 4
కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి .
- Step 5
పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి.