- Step 1
కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి వేడి చేయాలి. అది కరిగి ఎరగ్రా అవుతుంది.
- Step 2
ఆ పాకాన్ని గిన్నెకంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండుమూడు సార్లు జల్లించాలి.
- Step 3
ఆ పాకాన్ని గిన్నెకంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండుమూడు సార్లు జల్లించాలి.
- Step 4
ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి.
- Step 5
ఇందులో కోడిగుడ్డు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనని విడిగా నురగ వచ్చేలా గిలకొట్టాలి.
- Step 6
ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుతూండాలి. చివరలో ఎసెన్స్ వేసి కలపాలి.
- Step 7
క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గరదగ్గరగా పెట్టాలి.
- Step 8
వీటి మధ్యభాగంలో చిన్నముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెడితే బావుంటుంది.
- Step 9
కలిపి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి.
- Step 10
ముందే వేడి చేసుకున్న ఓవెన్‌లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి.
- Step 11
చల్లారిన తరవాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది.
- Step 12
అడుగున పెట్టిన పళ్లముక్కలు పైకి వస్తాయన్నమాట.