- Step 1
డ్రైఫ్రూట్స్ - పావు కేజీ (అంజీర్, సీడ్‌లెస్ ఖర్జూరం, కిస్‌మిస్, జింజర్ చిప్స్, నల్ల కిస్‌మిస్, కట్ పీల్, ఆరెంజ్ పీల్, కాజు... అన్నిటినీ చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి).
- Step 2
సుగంధద్రవ్యాల పొడి - టీ స్పూను (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చినచెక్క, లవంగాలు... అన్నీ కలిపి తయారుచేసుకున్న పొడి - టీ స్పూను. ఈ పొడిని డ్రైఫ్రూట్స్ మిశ్రమంలో వేయాలి).
- Step 3
ఒక పెద్ద బౌల్‌లో కోడిగుడ్ల సొన, డాల్డా, పంచదారపొడి వేసి బాగా కలపాలి.
- Step 4
అన్నీ కలిసిన తరవాత అందులో మైదాపిండి, డ్రైఫ్రూట్స్ మిశ్రమం, బేకింగ్ జతచేసి మరోమారు కలపాలి.
- Step 5
ఈ మిశ్రమాన్ని మౌల్డ్ (ఇష్టమైన ఆకారం ఎంచుకోవచ్చు) లో పోసి 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్ దగ్గర అవెన్‌లో సుమారు 30 నిముషాలు బేక్ చేయాలి.
- Step 6
బయటకు తీసిన తరవాత పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి.