- Step 1
కేక్ చేసే టిన్ను లోపల భాగమంతా వెన్న రాసి కొద్దిగా మైదాపిండి చల్లి గిన్నె అంతా పరుచుకునేలా కదపాలి.
- Step 2
ఒక గిన్నెలో పంచదార కరిగించి ఎరగ్రా అయ్యాక అందులో పావు కప్పు నీళ్లు కలిపి క్యారమిల్ సిరప్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌పౌడర్ వేసి రెండుసార్లు జల్లించాలి.
- Step 4
వెడల్పాటి గిన్నెలో వెన్న కరిగించి మిల్క్‌మెయిడ్ వేసి బాగా కలపాలి. ఇందులో బిస్లరీ సోడా, మైదాపిండి మార్చిమార్చి వేస్తూ బాగా కలపాలి.
- Step 5
చివర్లో క్యారమిల్ సిరప్, సన్నగా కట్ చేసుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి.
- Step 6
వెన్న రాసి పెట్టుకున్న కేక్ టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి.
- Step 7
ఓవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టి ముప్పావుగంట బేక్ చేయాలి.