- Step 1
ఒక పాత్రలో మార్గరిన్, పంచదారపొడి వేసి కలపాలి. ఎగ్‌బీటర్‌తో గుడ్లసొనను గిలకొట్టాలి.
- Step 2
ఈ సొనను పంచదార పొడిలో వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేంతవరకు బాగా గిలకొట్టాలి.
- Step 3
మైదా, దాల్చినచెక్క, ఏలకులపొడి కలిపి జల్లించాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి.
- Step 4
తర్వాత దీంట్లో ప్లమ్ ఫ్రూట్స్, గ్లూకోజ్, క్యారమెల్ కలర్ వేసి మరోసారి కలపాలి.
- Step 5
పిండి ముద్ద బాగా మెత్తగా అయ్యాక తగినంత తీసుకొని కేక్‌ను బేక్ చేసే పాత్రలో వేసి, పాత్రంతా పరుచుకునేలా చేత్తో మృదువుగా అదమాలి.
- Step 6
ఆ పాత్రను అవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 నుంచి 45 ని.లు బేక్ చేసి తీయాలి.
- Step 7
కేక్‌ను నచ్చిన అలంకరణతో వేడుకకు సిద్ధం చేసుకోవాలి.