- Step 1
ముందుగా కోడిగ్రుడ్లను పగులగొట్టి ఒక పాత్రలో వేసి బాగా నురగ వచ్చేలాగా గిలక్కొట్టాలి.
- Step 2
తరువాత అందులో కేక్‌జెల్, పంచదార, మైదాపిండి ఒకదాని తరువాత ఒకటి వేసి పిండి ముద్దలా చేసుకోవాలి.
- Step 3
దీనికి కోకో పౌడర్, లెమన్ జ్యూస్‌ను కూడా కలిపి పిండిని బాగా మర్దనా చేసి ఆపై, ఈ మిశ్రమాన్ని కేక్ ట్రేలో సర్ది బేక్ చేసుకోవాలి.
- Step 4
ఈలోపు చాక్‌లెట్, బట్టర్ కలుపుకుని హెవీ క్రీముని తయారు చేసుకోవాలి.
- Step 5
కేక్ తయారవగానే మీ కిష్టమైన షేప్‌లో కట్ చేసుకుని, కేక్‌పై షుగర్ సిరప్ పరచుకునేలా జాగ్రత్తపడాలి.
- Step 6
మరొక లేయర్ కేక్‌ని ఉంచి దానిపై చాక్‌లెట్ హెవీ క్రీముని, స్ట్రాబెర్రీ ముక్కలను పోయాలి.
- Step 7
ఇలా మీకు నచ్చిన విధంగా మూడు పొరలుగా కేక్‌ను అమర్చుకోవచ్చు.
- Step 8
పూర్తి అమరిక తరువాత కేక్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అతిథులకు అందించండి.