- Step 1
ముందుగా మొక్కజొన్న, పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- Step 2
ఈ మిశ్రమంలో బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
- Step 3
దీనిని ఒక పళ్లెంలో సమానంగా పరిచి దానిని కుక్క ర్‌లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
- Step 4
ఇది పూర్తిగా చల్లారాక చిదిపి పొడిపొడిగా వచ్చేలా చేయాలి. ఒక బాణలిలో 50 గ్రా. నూనె వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 1
తరవాత ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత, ఉడికించి చిదిపిన మొక్కజొన్న మిశ్రమం, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి రెండు మూడు నిముషాలు బాగా వేయించి దింపేయాలి. దీనిని వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.