- Step 1
మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
- Step 2
మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
- Step 3
తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
- Step 4
ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి.
- Step 5
ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది.
- Step 6
పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి.
- Step 7
ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి.