- Step 1
ముందుగా ఆలూ మధ్యలో చిన్నహోల్ చేసి కట్ చేసిన ముక్కలు కూడా ఆయిల్ లో వేయించుకోవాలి.
- Step 2
ఇలా వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని పన్నీర్‌ని తురిమి అందులో వేసుకోవాలి.
- Step 3
జీడిపప్పు, కిస్‌మిస్, చాట్‌మసాలా, ఉప్పు, ఇలాచీ పౌడర్‌లను కూడా వేసి బాగా కలిపి పెట్టాలి.
- Step 4
దీన్ని హోల్ చేసుకొని వేయించుకున్న ఆలూ లో స్టఫ్ చేసుకోవాలి.
- Step 5
మరో గిన్నెలో పెరుగు తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, చాట్‌మసాలా, నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్న ఆలూ పై వేసుకుని వాటిని ఒక పాన్ లో పెట్టి స్టవ్ పై కుక్ చేసుకుని పైన చాట్ మసాలా వేసుకోవాలి.