- Step 1
సోయాబీన్స్ ముందు రోజు నానబెట్టాలి .నానిన తరవాత ముక్కలుగా తరిగిన ఆలూ, కేరట్ తో కలిపి ఉడికించుకోవాలి . *తరువాత పచ్చికొబ్బరి, అల్లంవెల్లుల్లి ముద్ద, దాల్చిన చెక్క, ఇలాచీ ,లవంగా ,పుదీనా ఆకులు,పచ్చి మిర్చికలిపి మిక్సిలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కాకా ఆవాలు వేసి వేగాకా ఉల్లిపాయ ముక్కలు ,టమాటా ముక్కలు ,ఉప్పు ,పసుపు వేసి కలిపి ఉడికించిన తరువాత ముందుగా ఉడికించిన సోయాబీన్స్, ఆలూ, కేరట్ వేసి కలిపి సరిపడా నీళ్ళు పోసి 5 నిమిషాలు ఉడికించాలి .
- Step 3
ఇప్పుడు మసాలా పేస్ట్ వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించాలి .
- Step 4
ఇప్పుడు అరకప్పు నీళ్ళలో కార్నఫ్లోర్ కలిపి పోయాలి గ్రేవీ చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో కాని చపాతితో కాని సర్వ్ చేసుకోవాలి.