- Step 1
బెండకాయలను శుబ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత అందులో బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి, మీడియం మంట మీద 10 నిముషాలు వేయించుకోవాలి. .
- Step 3
తర్వాత అందులో శెనగపిండి, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు, ఎండు మామిడిపొడిని వేసి వేయించుకోవాలి.
- Step 4
తర్వాత 5నిముషాలు వేయించుకొన్న తర్వాత, శెనగపిండి మొత్తం బెండకాయలకు పూర్తిగా అంటుకుంటుంది, శెనగపిండి బ్రౌన్ కలర్ కు మారుతుంది .
- Step 1
బెండకాయలు మెత్తగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే ట్యాంగీ బేండి విత్ బేసన్ రిసిపి. అంతే బేండీ బేసిన్ రిసిపి సైడ్ డిష్ గా లేదా రోటీ, రైస్ తో మంచి కాంబినేషన్.