- Step 1
ముందుగా కూరగాయ ముక్కలు , కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినంత నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించాలి.
- Step 2
తరువాత బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, కొబ్బరి తురుము ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి, చల్లారాక మిక్సీలో కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 3
తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి చింతపండు రసం, ఉప్పు వేసి ఐదు నిముషాలు మరిగించాలి.
- Step 4
తరువాత మెత్తగా చేసుకున్న కందిపప్పు, ఉడికించుకున్న కూరముక్కలు, మసాలా పేస్ట్, బెల్లం తురుము, వేసి కలపాలి.
- Step 5
తగినంత నీళ్ళు పోసి పది నుంచి పదిహేను నిముషాలు మరిగించాలి.
- Step 6
ఇప్పుడు పాన్పెట్టి అందులో నూనె వేసి కాగాక-పోపు దినుసులు వేసి పోపు చేసుకుని చివరిలో కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి.