- Step 1
ముందుగా నీటిలో పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి.
- Step 2
తరువాత పాన్లో నూనె వేసి వేడయ్యాక పంచదార వెయ్యాలి. పంచదార బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.
- Step 3
ఇందులో మసాలా పేస్టు, ఉడికించుకున్న కాలీ ఫ్లవర్ ముక్కలు, బఠాణీలు వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి.
- Step 4
తర్వాత పనీర్, జీడిపప్పు, పెరుగు, ఓ కప్పు నీళ్లు పోసి సన్నని మంటపై ఉడికించాలి.
- Step 5
కాలీఫ్లవర్ ముక్కలు బాగా మెత్తపడ్డాక జీలకర్ర పొడి, టమాటో సాస్ వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి .
- Step 6
చివరిలో కొత్తిమీర వేసి రైస్ తో కాని చపాతితో కాని వేడి వేడి గ సర్వ్ చేసుకోవాలి.