- Step 1
బీట్‌రూట్ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
- Step 2
తరువాత ఉల్లిపాయలు, మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి మెత్తగా నూరాలి.
- Step 3
బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లిమసాలా ముద్దవేసి బాగా వేపుకోవాలి.
- Step 4
అది వేగుతున్నప్పుడే బీట్‌రూట్ ముక్కలు వేసి, పసుపు, ఉప్పు, కారం కూడా వేసి మూతపెట్టి కాసేపు ఉంచాలి.
- Step 5
తర్వాత మూత తీసి కొంచెం నీరు పోసి కలిపి మూతపెట్టాలి.
- Step 6
మధ్యమధ్యలో కలుపుతూ సన్నసెగమీద ఉడికించాలి. ముక్క ఉడికాక నీరు ఇగిరాక పొయ్యి మీద నుంచి దించాలి. * మసాలా ఘుమఘుమలతో బీట్‌రూట్ కూర రెడీ. ఈ బీట్‌రూట్ కూర అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీల్లోకి కూడా బాగుంటుంది.