- Step 1
ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీరు తీసుకోవాలి, క్యాలీఫ్లవర్ ని చిన్న చిన్న పువ్వులుగా చేసి వేడినీళ్ళలో కడగాలి. *ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో చిన్న చిన్న పురుగులు ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి క్యాలీఫ్లవర్ విడివిడి పువ్వులను వేడి నీళ్ళలో వేస్తే
పురుగులు బయటపడిపోతాయి. వాటిని తీసిపారేయాలి.
- Step 2
ఆ తరువాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఆలూ ముక్కలతో కలిపి కొంచెం ఉడికించి వార్చాలి.
- Step 3
తరువాత ఒక బౌల్లో నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 4
అల్లం, మిర్చి, వెల్లుల్లి కలిపి గ్రేడ్ చేసుకొని ఈ పేస్ట్ వేసి వేయిచాలి.
- Step 5
ఇప్పుడు ఉడికించిన ఆలూ, క్యాలీఫ్లవర్ వేసి కలపాలి.
- Step 6
తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాకా వేయించాలి, చివరిగా గరంమసాలా, కొత్తిమీర వేసి కలపాలి. అంతే, మనకి బాగా నచ్చే క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీ రెడీ.