- Step 1
ఈ కర్రీ తయారు చేసుకోటానికి ముందుగా బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడగాలి.
- Step 2
తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసాకా బేబీ పొటాటోలు వేసి నిధానంగా ఫ్రై చేసుకోవాలి. * ఒక పది నిమిషాలపాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
- Step 3
బేబీ పొటాటో ఫ్రై అయిన తర్వాత నూనె నుండి పొటాటోలను బౌల్లోకి తీసి పెట్టుకోవాలి.
- Step 4
అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
- Step 5
అందులో ఉల్లిపాయ ముద్ద వేసి మరో అయిదు నిముషాలు వేయించాలి.
- Step 6
ఉల్లిపాయ పచ్చివాసన పోయాకా అందులో టమోటో పేస్ట్ కూడా వేసి అయిదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పసుపు,ఉప్పు కూడా వేయాలి. గ్రేవీ అడుగు అంటకుండా మెల్లిగా కదుపుతూ ఉండాలి. అందులోనే కారం, ధనియాల పొడి,గరం మసాలా వేయాలి.
- Step 7
ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
- Step 8
ఇలా తయారయిన కర్రీ ని బౌల్ లోకి తీసి కొత్తిమీరతో అలంకరించుకుంటే చూడటానికి అందంగా మాత్రమే కాదు చపాతిలతో గాని అన్నంతో గాని తినటానికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది.