- Step 1
ముందుగా ఆలు ని ఉడికించు కోవాలి . ఆ తర్వాత తొక్క వొలిచి , చాకుతో ఒక సైజు లో వచ్చేలా ముక్కలు కట్ చేసుకోవాలి .
- Step 2
ఈ లోపు మెంతులని పొడి మూకుడులో (నూనె వేయకూడదు ) ఎర్రగా వేయించుకొని , అవి కొంచం వేగగానే నువ్వులు కుడా వేసి వేయించాలి .
- Step 3
నువ్వులు చిటపట అంటుండగా ఎండు మిర్చి వేసి వేయించాలి .
- Step 4
ఆఖరుగా ఆవాలు వేసి దించేయాలి. ఆవాలు వేడి ఎక్కితే చాలు . ఎర్రగా వేగాక్కరలెద్దు.
- Step 5
అలా వేయించిన దినుసులన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . ఆఖరులో వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి తిప్పి ఆపేయాలి. వెల్లుల్లి మెత్తగా అవ్వకూడదు .
- Step 6
ఇక ఇప్పుడు బాణలి లో పప్పు నూనె వేసి ( ఈ నూనె తోనే కూర రుచి వచ్చేది ) ఆవాలు , కరివేపాకు వేసి, వెంటనే ఒలిచి సిద్దం గా పెట్టుకున్న ఆలు ముక్కలు , ఉప్పు , పసుపు , గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి బాగా కలపాలి . ఆఖరులో ఆమ్చూర్ పొడి వేసి కలియ పెట్టి దింపుకోవాలి.
- Step 7
డిఫరెంట్ టేస్ట్ తో అచారి ఆలు పిల్లలకి బాగా నచ్చుతుంది . ఆఖరులో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు .