- Step 1
ఈ తందూరీ చీక్స్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి షా జీరా వేయాలి.
- Step 2
తరువాత బీన్స్ ముక్కలు, ఉల్లితరుగు,పచ్చి మిర్చి ముక్కలు వేసి పచ్చి పోయేదాకా 2 నిమిషాలు వేయించాలి.
- Step 3
పుదీనా కూడా వేసి వేయించాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి కలపాలి.
- Step 4
సరిపడా ఉప్పు వేసి ఆఖరుగా పనీర్ తురుము వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించుకోవాలి.
- Step 5
ఈ మిశ్రమం చల్లారాకా గరిటెతో బాగా మెదపాలి.
- Step 6
ఇలా తయారయిన ముద్దని చీక్స్(ఊచ) కి పొడుగుగా అంటించి గ్రిల్ పై పెట్టి కాల్చుకోవాలి.
- Step 7
అన్ని వైపులా బాగా కాలిన తరవాత వాటిపై కాస్త పెరుగు రాయాలి.
- Step 8
వీటిని పుదీనా చెట్నీ లేదా టమాటా సాస్ తో ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.