- Step 1
మిల్ మేకర్ ని వేడినీళ్ళల్లో వేసి ఒక నిముషం తరువాత నీళ్ళు పిండి కీమా కట్ చేసి పక్కన పెట్టాలి.
- Step 2
జీడిపప్పు, గసాలు, కొబ్బరి కలిపి పేస్టు చేసుకోవాలి.
- Step 3
స్టవ్ మీద కళాయిపెట్టి నూనెవేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.
- Step 4
ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడ్డాక కొబ్బరి పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి రెండునిముషాలు ఉడికించాలి.
- Step 5
ఇప్పుడు మిల్ మేకర్ కీమా, నెయ్యి వేసి రెండునిముషాలు ఉడికించి గరంమసాలా, కొత్తిమీర వేసి మూతపెట్టి దించాలి.