- Step 1
ముందుగా మొలకెత్తిన పెసలు, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర తీసుకొని కొద్దిగా ఉప్పువేసి మెత్తగా అంటే గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు బాణలి తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి అది కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి.
- Step 3
టమాటా ముక్కలు కొంచెం ఉడికిన తరువాత.. అందులో ఉడికించుకున్న బంగాళదుంపల ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం అల్లంవేసి బాగా కలపాలి. దీంతో బంగాళదుంప కూర రెడీ అవుతుంది.
- Step 4
ఇప్పుడు దీనిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలి.
- Step 5
మరో బాణలి తీసుకొని దానిలో నూనె పోసి అది కాగిన తరువాత బంగాళదుంప ఉండలను పెసర పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే కరకరలాడే. బంగాళదుంప బోండా రెడీ.