- Step 1
ఆకు కూరలన్నీ విడి విడిగా, సన్నగా తరిగి పెట్టాలి.
- Step 2
కుక్కర్ లో 1 కప్పు నీళ్ళు పోసి ,తరిగిపెట్టిన ఆకుకూరలు , పసుపు , కారం , ఉల్లిపాయలు ముక్కలు, 2 వెల్లులి రెబ్బలు వేసి ,కుక్కర్ మూత పెట్టి , ౩ విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి.
- Step 3
ఉడికిన ఆకుకూరల్ని తగినంత ఉప్పు వేసి మెత్తగా మెదపాలి.
- Step 4
బాండిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి , వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వరసగా వేస్తూ తాలింపు తయారు చేయాలి.
- Step 5
ఈ తాలింపుని మెత్తగా మెదిపి పెట్టిన ఆకుకూరలు పులుసులో వేసి బాగా కలిపి , కొంచెం కొత్తిమీర చల్లాలి.
- Step 6
మూతపెట్టి 5 నిముషాలు అలాగే ఉంచితే తాలింపులో ఆకుకూరల పులుసు బాగా మగ్గుతుంది .ఈ కూర అన్నంలో ,చపాతీ , రోటిల్లో చాలా బాగుంటుంది.