- Step 1
ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి.
- Step 2
మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనెవేసి, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, అందులో టమాటా రసం, పాలక్ పేస్ట్ , ఉప్పు, మిరియాల పౌడర్ అన్నీవేసి బాగా వేయించి (మగ్గించి) పక్కన ఉంచుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, అది దోరగా కాలిన తరవాత పాన్ పైనుండి పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- Step 5
దానిపై ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా & పాలక్ పేస్ట్ ని వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు & చీజ్ ని పైన పరచి, 450 డిగ్రీల ఫారన్ హీట్ వేడిలో 10 నిముషాలు పాటు ఓవెన్ లో ఉంచి తీసి కొంచెం చల్లబడిన తరవాత తినేయ్యటమే.
- Step 6
అంతే చాలా రుచికరమైన, బలమైన .... పిల్లలు ఎంతో ఇష్టపడే పాలక్ ఊతప్పం రెడీ.