- Step 1
నాన పెట్టిన గింజల్ని కుక్కర్లో ఒక అయిదు విసిల్స్ వచ్చేవరకు వుంచి ..దించాలి. .
- Step 2
ఈ లోపు వేరే బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,కసూరి మేతి వేసి అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. * ఉల్లిపాయలు వేయించి నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తె త్వరగా వేగుతాయి.
- Step 3
ఉల్లి పాయలు ఎర్రగా అయ్యాక అందులో టమాటా ప్యూరి వేసి కలపాలి. అది ఒక్క ఉడుకు ఉడకగానే ...అందులో ధనియాలపొడి నుంచి , పసుపు, కారం తో సహా అన్ని వేసి కలపాలి. (కొబ్బరి ,సెనగపిండి , పెరుగు తప్ప ).
- Step 4
అవి బాగా కలిసాక ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ , ఉప్పు , వేసి కలపాలి.
- Step 5
కూర ఉడకటం మొదలు కాగానే కొంచం సేపు మూత పెట్టి ఉంచాలి..అప్పుడు అన్ని రుచులు స్ప్రౌట్స్ కి పడతాయి. * దించేముందు సెనగ పిండి, పెరుగు, కొబ్బరి వేసి కలిపితే చాలు.
- Step 6
ఈ కూర చపాతిల లోకి బావుంటుంది. నీరు ఎక్కువగా లేకుండా చేస్తే చపాతిల మద్యన పెట్టి రోల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. కొంచం చాట్ మసాలా వేసి ...చాట్ లా తినచ్చు.