- Step 1
ముందుగా ఆలూని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే టమాటోని కూడా. ఉల్లిపాయలని మెత్తగా కాకుండా కొంచం కచ్చాపచ్చా గా దంపుకోవాలి. ( లేదా గ్రైండ్ చేస్తే ..ఒక్కసారి తిప్పి వదిలేయాలి). టమాటో లని చాలా చిన్న ముక్కలుగా తరగాలి.
- Step 2
ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- Step 3
అలా ధనియాల మిశ్రమం మెత్తగా అయ్యాక అందులో పచ్చికొబ్బరి వేసి మళ్ళీ తిప్పాలి. ఇక అప్పుడు చిన్న కుక్కర్ లో నూనె వేసి అందులో కొంచం జీల కర్ర, ఆవాలు వేసి అవి చిటపట లాడాక ముందు ఉల్లి చెక్కు వేసి వేయించాలి.
- Step 4
అవి ఎర్రగా అవుతుండగా, ధనియాలు, కొబ్బరి మిశ్రమాన్ని వేసి వేయించాలి.
- Step 5
రెండు నిముషాలు వేయిస్తే చాలు. లేదంటే కొబ్బరి మాడిపోయే అవకాసం వుంది. ఆ వెంటనే ఆలూ, టమాటో వేసి కలిపి, ఉప్పు,కారం, పసుపు కూడా వేసి బాగా కలపాలి.
- Step 6
చిన్న గ్లాసుడు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ..ఒక నాలుగు విసిల్స్ రానిచ్చి ఆపాలి.
- Step 7
మూత వచ్చాక ఒకసారి కలిపి, స్టవ్ మీద రెండు నిముషాలు ఉండనిస్తే కూర దగ్గర పడుతుంది . గ్రేవీగా వుండే ఈ కూర చపాతీలలోకి చాలా బావుంటుంది.