- Step 1
ముందుగా ఆనపకాయను కోరుకొని పెట్టుకోవాలి (గ్రైండ్ చేయోద్దు నీరైపోతుంది).
- Step 2
కోరిన తరువాత బియ్యం పిండిలో ఈ కోరును వేసి.. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పును కూడా గ్రైండ్ చేని ఈ మిశ్రమాన్ని కూడా బియ్యంపిండిలో వేసి కలపాలి.
- Step 3
ఇప్పుడు బియ్యంపిండికి సరిపడినంత ఆనపకాయ తురుమును కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. (ఆనపకాయలో నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు).
- Step 4
ఆఖరిలో ఒక రెండు చెంచాలు నూనె వేసి పిండి దగ్గరగా కలుపుకోవాలి వడల పిండిలా. ( గట్టిగా కాకుండా, మెత్తగా కాకుండా).
- Step 5
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పదినిమిషాలు పక్కన పెట్టుకొని ఈలోపు బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత ఓ కవర్ కి కాని చేతికి కాని కొంచం నూనె రాసుకొని వడలుగా వత్తుకొని నూనెలో వేసి వేయించాలి.
- Step 6
వడలని బంగారు వర్ణం వచ్చేంతవరకూ వేయిస్తే చాలు ఎందుకంటే ఆనపకాయ తురుము ఉంది కాబట్టి తొందరగా మాడే అవకాశం ఉంటుంది. అంతే ఆనపకాయ వడలు(లౌకి వడలు ) రెడీ.