- Step 1
ముందుగా మిరపకాయలు కడిగి శుభ్రం చేసుకుని మధ్యలో చీరుకుని ఉంచుకోవాలి (బజ్జీ మిపకాయలు.. ఎందుకంటే కారం తక్కువగా ఉంటుంది).
- Step 2
ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మరిగాక మిరపకాయలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
- Step 3
ఇలా చేయడం వల్ల మిరపకాయల్లో కారం తగ్గుతుంది.
- Step 4
మరో పాత్రని తీసుకొని దానిలో వేరుశెనగ గుళ్లు వేయించుకోవాలి.. అవి వేగాక ధనియాలు నువ్వులు, ఎండుకొబ్బరి కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తరువాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిలోనే ఉల్లిపాయ ముక్కలు,టమాటా క్కలు,అల్లం,వెల్లుల్లి,పసుపు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా నూరుకోవాలి.
- Step 6
ఇలా తయారు చేసుకున్న స్టఫ్ ను ఉడికించుకున్న మిరపకాయల్లో కూర్చి పెట్టుకోవాలి.
- Step 7
మరో పాత్రలో నూనె తీసుకొని అది మరిగిన తరువాత మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
- Step 8
మిగిలిన మసాలా ముద్దలో కొంచెం నీరు పోసి వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయల్ని వేసి మిరపకాయలు బాగా ఉడికి మిశ్రమం దగ్గర పడిన తరువాత స్టవ్ ఆపేస్తే సరి. మిరపకాయ మసాలా కూర రెడీ అయినట్టే.