- Step 1
ముందుగా ఉప్మారవ్వని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ను తురుముకోవాలి.
- Step 2
ఒక చిన్న గిన్నెలో రవ్వని తీసుకొని దానిలో క్యారెట్ తురుముని, ఉల్లిపాయముక్కలు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి.
- Step 3
ఇందులో కొంచెం పెరుగు వేసి మరీ జోరుగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి.
- Step 4
ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు పోపు చేయాలి.
- Step 5
ఈ పోపును కలిపి ఉంచుకున్న రవ్వలో వేసుకొని చివరిగా బేకింగ్ పొడి కొంచెం వేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మిశ్రమాన్ని కేక్ ప్యాన్ లోకి తీసుకొని అవన్ (oven) ని 180C ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఉడికే వరకూ బేక్ చేసుకోవాలి.
- Step 7
ఉడికిన తరువాత దీనిని బయటకు తీసి పీసెస్ లా కట్ చేసుకొని తినవచ్చు. కావాలంటే ఏదైనా పచ్చడితోనైనా తినవచ్చు.