- Step 1
ముందుగా సేమ్యాని కొద్దిగా నెయ్యిలో వేయించుకుని ఆ తర్వాత నెళ్ళల్లో మెత్తగా ఉడికించుకోవాలి.
- Step 2
ఉడికిన తర్వాత నీరు పూర్తిగా వంపేసి, ఒకసారి చల్లనీళ్ళతో కడిగాలి.
- Step 3
ఇప్పుడు కొద్దిగా గిలక్కొట్టిన చిక్కటి పెరుగులో ఉడికించిన సేమ్యా, ఉప్పూ వేసి కలిపాలి. పెరుగు పుల్లగా ఉన్నా, పులవకూడదనుకున్నా సగం పాలు కలుపుకోవచ్చు.
- Step 4
మూకుడులో నూనె వేడి చేసి, దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు బాగా వేగాకా, ఇంగువ, సనంగా తరిగిన అల్లం, పచ్చిమిర్చీ, కరివేపాకు వేసుకొని అవి కొంచం వేగగానే దింపి చల్లారనివ్వాలి.
- Step 5
ఇప్పుడు చల్లారిన పోపుని ముందుగా కలిపి ఉంచుకున్న సేమ్యా, పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
- Step 6
పైన అలంకరణకి దానిమ్మ గింజలు, తురిమిన కేరట్ వేసుకోవాలి. ఇది వేడిగా తిన్నా, లేక ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.