- Step 1
మూకుడులో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పును బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
- Step 2
కొబ్బరి కాయ కొట్టి చిక్కటి పాలు తీసి పెట్టుకోవాలి.
- Step 3
జీడిపప్పు, కిస్ మిస్ నేతిలో వేయించి పెట్టుకోవాలి.
- Step 4
వేయించుకున్న పెసరపప్పును మెత్తగా ఉడికించుకోవాలి, ఆపైన మెదిపి పెట్టుకోవాలి.
- Step 5
బెల్లాన్ని కొద్దిగా నెళ్ళల్లో కరిగించి, వడకట్టి తయారుగా ఉంచుకోవాలి.
- Step 6
ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో ఉడికించిన పప్పు, కరిగిన బెల్లం కలిపి కొంచం సేపు ఉడికించుకోవాలి. బెల్లం వాసన పూర్తిగా పోయేదాకా ఉండాలి.
- Step 7
ఈ మిశ్రమానికి పాలు కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి, పాలు విరగకూడదు.
- Step 8
ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలు, ఏలకుల పొడు వేసి ఒకే పొంగు వచ్చేవరకూ ఉంచి దింపెయ్యాలి. వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ లతో అలంకరించి చల్లగా కానీ వేడిగా కానీ వడ్డించుకోవచ్చు.