- Step 1
ముందుగా టమాటాలని కడిగి, వాటి తొడిమ దగ్గర కట్ చేసి, లోపల గుజ్జునంతటినీ తీసేయాలి.
- Step 2
ఆ తర్వాత ఉడికించిన ఆలుని ఒక బౌల్‌లో వేసి మెత్తగా మెదపాలి.
- Step 3
అందులో ఉప్పు, కారం, డ్రై మ్యాంగో పౌడర్, గరం మసాలా, గ్రీన్ బఠానీ వేసి బాగా కలపాలి. * ఇప్పుడు ఆ మిశ్రమాన్ని టమాటా లోపల పెట్టాలి. అలా ఒక్కో టమాటాని ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, కారం, వంటసోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకుని అందులో ముందుగా రెడీచేసి పెట్టుకున్న టమాటలని ఆ పిండిలో ముంచి వేడి నూనెలో వేయించాలి.
- Step 5
రెండు నిమిషాల్లో వేగిపోతుంది. బజజీల పిండిని మరీ జారుగా కలుపుకోకూడదు. అప్పుడే టమాటాలకి పిండి పట్టి రుచి వస్తుంది.
- Step 6
వేయించిన బజ్జీలని ఓ ప్లేట్‌లోకి తీసుకుని మధ్యగా చాకుతో కట్‌చేసి వడ్డిస్తే తినడానికి వీలుగా వుంటుంది.
- Step 7
బజ్జీల పిండి, లోపల టమాటా, ఆలూ అన్నీ కలసి మంచి టేస్టీగా వుంటుంది. ఈ టమాటా బజ్జీ ఒకసారి ట్రై చేయండి.