- Step 1
ముందుగా కొబ్బరి, పచ్చిమిర్చి, గసగసాలు, నువ్వులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 2
ఆ తర్వాత బాణలిలో ఓ నాలుగు చెమ్చాల నూనె వేసి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకు వేసి ఒక్క నిమిషం వేయించాలి.
- Step 3
ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
- Step 4
ఇప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
- Step 5
ఆ వెంటనే సన్సగా తరిగిన టమాటాలని ఆ మిశ్రమానికి కలిపి ఉప్పు వేసి కలియబెట్టి మూతపెట్టాలి.
- Step 6
సన్నని మంట మీద ఓ పది నిమిషాలు మగ్గిస్తే చాలు.
- Step 7
టమాటా బాగా మగ్గాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దని వేసి కలపాలి.
- Step 8
అప్పటికే టమాటా లోని నీళ్లు వచ్చి ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా గ్రేవీ కోసం వేరే నీళ్లు పోయక్కర లేదు.
- Step 9
ఒకవేళ కూర మరీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే చిన్న కప్పు నీళ్లు పోసి పెద్ద మంట మీద రెండు నిమిషాలు ఉంచి ఆపాలి.
- Step 10
ఈ కూర పుల్లగా, కొంచం మసాలా వాసనతో రుచిగా ఉంటుంది. ఈ కుర్మాని రైస్ ఐటమ్స్ కి సైడ్ డిష్ గా వాడచ్చు.