- Step 1
మొదటగా గోధుమరవ్వలో బాణలీలో వేసుకుని, అందులో కొద్దిగా నెయ్యి వేసి వేయించుకోవాలి.
- Step 2
రవ్వ రంగు మారుతున్న సమయంలో పొయ్యి మీద నుంచి దించుకోవాలి.
- Step 3
ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని నూనె, ఆవాలు, మినప, శనగపప్పులు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, కేరెట్ ముక్కలు, ఎండు మిర్చి, పచ్చిమిర్చి ముక్కలు ... అన్నీ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.
- Step 4
ఆ తర్వాత అందులో నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొబ్బరి కోరు అందులో వేసుకోవాలి.
- Step 5
రుచికి తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి. నీళ్ళు మరుగుతూ వుండగానే రవ్వని ధారగా పోస్తూ కలుపుకోవాలి. రవ్వ కొద్దిసేపు ఉడికిన తర్వాత, మిగిలిన నెయ్యి అందులో వేసి బాగా కలపాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్‌ని 5 నిమిషాలపాటు సిమ్‌లో వుంచాలి. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత మూత తీయకుండా ఓ పది నిమిషాలు వుంచాలి. ఆ తర్వాత చట్నీ లేదా చక్కరతో తినవచ్చు.
- Step 7
సాధారణంగా చాలామంది ఉప్మా తినరు. అలాంటి వారికి కూడా ఈ రవ్వ కొబ్బరి ఉప్మా నచ్చుతుంది.