- Step 1
ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళు పోసి, ఉప్పు, పసుపు, మజ్జిగ వేసి వుంచండి. పుల్లటి మజ్జిగ అయితే మరీ మంచిది. * కాకరకాయల్ని కడిగి, పైన వున్న చిన్న చిన్న ముచ్చికల లాంటివి గీరేసేయాలి.
- Step 2
అలా గీరేసిన తర్వాత కొసల దాకా వెళ్ళకుండా కాకరకాయ మధ్యలో గాటు పెట్టండి.
- Step 3
ఆ తర్వాత వాటిని మజ్జిగ, నీరు, ఉప్పు, పసుపు వేసి కలుపుకున్న గిన్నెలో వేసి ఉడకబెట్టండి. కాయ మరీ మెత్తగా అవకుండా ఉడకబెట్టిన తర్వాత నీటిని వంచేయండి.
- Step 4
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పును కచ్చాపచ్చాగా దంచుకోండి. బాణలీలో నూనె వేసి కాగాక ముందుగా కాకరకాయల్ని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి.
- Step 5
వాటిని తీసి పక్కన పెట్టుకుని, ఉల్లి, పచ్చిమిర్చి, కారాన్ని అదే నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోండి.
- Step 6
ఈ కారాన్ని కాకరకాయల్లో పెట్టి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని, కాకరకాయని కొరుక్కుంటూ తినొచ్చు.