- Step 1
ముందుగా బాణలి లో నెయ్యి వేసి , కొంచం కాగ గానే జీలకర్ర వేయాలి.
- Step 2
ఆ వెంటనే పచ్చిమిర్చి , అల్లం వెల్లులి పేస్టూ వేసి వేయించాలి.
- Step 3
ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి పాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించాలి.
- Step 4
అప్పుడు టమాట ముక్కలని కూడా వేసి చిటికెడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి.
- Step 5
టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా మెత్త పడతాయి. చివరిగా పన్నీరు వేయాలి. అప్పడే సరిపడా ఉప్పు , కారం కూడా వేసి కలపాలి.
- Step 6
పన్నీరు వేసాక ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచకూడదు . ఓ రెండు నిముషాలు బాగా కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీ లోకి, అలాగే బ్రెడ్ టోస్ట్ కి కూడా బావుంటుంది.