- Step 1
ముందుగా ఉల్లిపాయలు,క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 2
తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేరుశనగ పప్పులు, నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకుని అందులోనే నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను, పన్నీర్‌ను విడివిడిగా వేయించుకోవాలి.
- Step 3
ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పులు, చింతపండు, పుదీనా, కరివేపాకు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ , యాలకులు, లవంగాలు, వేయాలి.
- Step 5
తర్వాత క్యాప్సికం ముక్కలు, మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
- Step 6
ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి పది నిమిషాలు ఉడికించాలి.
- Step 7
చివరలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.