- Step 1
ముందుగా బఠానీలను ముందురోజే నానబెట్టుకోవాలి.
- Step 2
అలా నానిన బఠానీలను ఓ 5 విజిల్సు వచ్చేదాకా కుక్కర్‌లో ఉడికిస్తే పూర్తిగా గట్టిగా కాకుండా, అలా అని పూర్తిగా మెత్తబడకుండా ఉంటాయి.
- Step 3
కూర తయారీకి ముందుగా బాణీలో నూనె వేసుకుని, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, తరుగులు వేసి వేయించాలి.
- Step 4
ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, గరం మసాలా కూడా చేర్చి కాసేపు వేయించాక చింతపండు గుజ్జు, కొబ్బరి తురుము, పంచదార కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలిపి ఆఖరున ముందుగా ఉడికించిన బఠానీలు, ఉప్పు చేర్చి కలియబెట్టాలి.
- Step 5
చిన్న కప్పు నీరు పోసి మూత పెట్టాలి. సన్నని మంట మీద ఓ పదినిమిషాలు ఉడికిస్తే బఠానీలకు ఉప్పు, కారం, మసాలా, పులుపు అన్నీ చక్కగా పట్టి మంచి రుచి వస్తుంది.